Friday, December 20, 2024

జాగ్రత్త.. పిడుగులు పడే అవకాశం

- Advertisement -
- Advertisement -

Chance of thunderstorms in Hyderabad

హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

హైదరాబాద్ : వేసవి కాలంలో కురిసే వర్షాలకు పిడుగులు పడే అవకాశముందని వీటి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. దీంతోపాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఆమె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News