Thursday, January 23, 2025

గ్రూప్-1 దరఖాస్తుల సవరణలకు అవకాశం

- Advertisement -
- Advertisement -

Chance to correct mistakes in Group-1 applications

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సవరించుకోవాలని తెలిపింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల ఎడిట్ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్ -1 పోస్టుల భర్తీకి అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News