Monday, January 20, 2025

చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమం: బాంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఎండీ, సిఇఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సిబిఐ అరెస్టు చేయడం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొంది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

నేరం అంగీకరించకపోవడమంటే విచారణకు సహకరించడం లేదని అర్థం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News