Sunday, January 19, 2025

ఉద్యమాలకు నాంది పలికిన ‘చాందా’

- Advertisement -
- Advertisement -

చాందా రైల్వే ఉద్యమం. అవును ఇది నిజమే. కానీ చరిత్రలో దీనికి ప్రాధాన్యత లభించలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఆధునిక సమాజంలో జరిగిన మొదటి సామాజిక ఉద్యమం. కర్ణాటకలోని వాడి నుండి హైదరాబాద్ వరకు గుల్బర్గా మీదుగా రైల్వే లైను వేయాలని 1870 లో బ్రిటీష్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆ తర్వాత దానిని నేటి చంద్రాపూర్ వరకు పొడిగించాలని, దానిని ఇప్పటి కొత్తగూడెం వరకు పొడిగించాలని మార్పులు చేశారు. అప్పట్లోనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో, ఇప్పటి తెలంగాణలోని కొత్తగూడెం ప్రాంతంలోని సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ రైల్వేలైన్ వలన బొగ్గును త్వరితగతిన, సులభంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చని భావించారు. అయితే దానిలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుందని, ప్రభుత్వం డబ్బు ఎక్కువగా వృథా అవుతుందని భావించిన నిజాం ప్రభుత్వం ఆ ప్రణాళికను బహిర్గతం చేయలేదు. ఈ విషయం ఎలాగోలాగా తెలుసుకున్న కొందరు విద్యావంతులు ఈ పథకాన్ని వ్యతిరేకించడంతో పాటు, ఇందుకు వేసుకున్న పథకం వివరాలను, ఖర్చును, దాని ప్రయోజనాన్ని వివరించాలని నిజాం ప్రభుత్వాన్ని ఆ విద్యావంతుల బృందం కోరింది.

తెలంగాణ సమాజం మీద ఎంతో ప్రభావం కలిగించిన ఆర్యసమాజ్ 1892లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చాందా రైల్వే ఉద్యమంలో పాల్గొన్న కేశవరావు కోరాట్కర్ ఆర్య సమాజ్‌లో కీలక పాత్ర వహించి, 1905 వచ్చే సరికి హైదరాబాద్ స్టేట్ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆర్యసమాజ్‌లో పాల్గొన్న ప్రముఖులు చాలా మంది ఆ తర్వాత గ్రంథాలయోధ్యమంలో, ఆంధ్ర మహాసభలో ముఖ్యభూమిక పోషిం చారు. ఈ ప్రవాహం నుంచే వెలువడిన మరొక పాయ దళితోద్యమం. మొదటిగా ఆర్య సమాజ్‌లో ఉన్న భాగ్యరెడ్డి వర్మ ఆ తర్వాత తానే సొంతంగా ఆది ఆంధ్ర ఉద్యమానికి రూపకల్పన చేశారు. అఘోరనాథ్ స్థాపించిన యంగ్ మెన్స్ ఇంప్రూ వ్‌మెంట్ సొసైటీ ఆర్య సమాజ్‌లోకి, ఆర్య సమాజ్ గ్రంథాలయోద్యమంలోకి, ఆ తర్వాత ఆంధ్ర మహాసభ. దాని కొనసాగింపే కమ్యూనిస్టు పార్టీ. అది నిర్వహిం చిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం. మరికొంత కాలం ప్రజలే నడిపిన పోరాటాలు. ఈ 1956 నుంచి 1969 వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ అవి ఎక్కడా నమోదు కాలేదు.

అయితే ప్రభుత్వం ఈ చైతన్యాన్ని సహించలేకపోయింది. ఈ ఉద్యమంలో పొల్గొన్న ముఖ్యలను హైదరాబాద్ నుంచి బహిష్కరించింది. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సభ్యులు ర్యాలీలు నిర్వహించి తమ చైతన్యాన్ని చాటుకున్నారు. స్త్రీ విద్య, ఇతర సామాజిక సంస్కరణలను ప్రజల్లో ప్రచారం చేయడానికి, అందుకుగాను నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించడానికి 1879లో యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీని ప్రారంభించారు. ఇందులో ప్రముఖ పాత్ర వహించినది అఘోరనాథ్ ఛటోపాధ్యాయ్. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, గొప్ప సాహితీ వేత్త సరోజని నాయుడు తండ్రి. ఆయనతో పాటు ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, మహమ్మద్ ముర్తుజా, కేశవరావు కోరాట్కర్, వామన్ నాయక్ లాంటి వాళ్ళు ముఖ్యులు.
ఈ విద్యావంతుల నాయకత్వంలో 1883 లో నిజాంకు వ్యతిరేకంగా మొదటి సామాజిక ఉద్యమం పురుడు పోసుకుంది. ఈ బృందం కేవలం పథకాన్ని గుడ్డిగా వ్యతిరేకించలేదు. లోతైన అధ్యయనం జరిపింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు అంచనాను తప్పుపట్టింది. ఈ పథకం మొత్తం వివరాలను, ఖర్చు అంచనాను బయటపెట్టాలని కోరింది. నాకు తెలిసి అంతకు ముందు గాని, ఇంత నిర్దిష్టంగా అధ్యయనం జరిపి ఆ పథకం సంపూర్ణ సమాచారం ఇవ్వాలని కోరిన ప్రజాసంఘాలు, సంస్థలు అరుదు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఇది మొట్ట మొదటి సమాచారం హక్కు ఉద్యమంగా చెప్పుకోవచ్చు. అయితే కారణాలేమైతేనేమి ఈ ఉద్యమానికి రావాల్సిన గుర్తింపు రాలేదు.
రెండో విషయం, ఈ రోజు తెలంగాణ సామాజిక, రాజకీయ చైతన్యం దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. గత 150 ఏళ్ళలో ఎన్నో ఉద్యమాలు, ఆ ఉద్యమాల వల్ల మరెన్నో సామాజిక, రాజకీయ మార్పులు జరిగాయి. వాటన్నింటికీ పునాది వేసింది యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ, ఆ సంస్థ నాయకత్వం వహించిన చాందా రైల్వే ఉద్యమం. ఇది చరిత్రలో ప్రముఖంగా నమోదు కావాల్సి ఉంది. ఈ ఉద్యమం మీద విస్తృతమైన పరిశోధన జరగాల్సి ఉంది. ఈ సంస్థ నిర్మాణంలో చాందా రైల్వే ఉద్యమంలో కీలక పాత్ర వహించిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ్ తెగువ, చొరవ మరువలేనిది. ఆయన ఆలోచనలు, ఆయన వేసిన విత్తనాలు వేల వేల వృక్షాల వనాలను అందించాయి. అఘోరనాథ్ బెంగాల్‌లోని బిక్రంపూర్‌లో 1851, అక్టోబర్ 31వ తేదిన జన్మించారు. హైస్కూల్ వరకు ఇప్పటి బంగ్లాదేశ్‌లోని ఢాకాలో చదివారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు సాగించారు. భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్న సమయంలో 1878లోనే నిజాం ప్రభుత్వం అఘోరనాథ్ ఛటోపాధ్యాయ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి ఇంగ్లీషు మీడియం స్కూల్‌ను ప్రారంభించి ఆయనను ప్రిన్సిపాల్‌గా నియమించారు. అదే నేటి నిజాం కాలేజీ. అదే విధంగా ఛాదర్‌ఘాట్‌లో బాలికల పాఠశాలను ప్రారంభించారు. అదే నేటి కోఠి ఉమెన్స్ కళాశాల. అంటే హైదరాబాద్ విద్యా వ్యాప్తిలో అఘోరనాథ్ పాత్ర చాలా కీలకం. అయితే తాను పదవిలో ఉన్నానని, ప్రభుత్వాన్ని నిలదీయకూడదని ఆయన ఎన్నడూ అనుకోలేదు. అందుకే ఆయన సామాజిక సమస్యల పరిష్కారంతో పాటు, రాజకీయ పోరాటాలను కూడా నిర్వహించారు.
ఈ ఉద్యమం నిర్వహించినందుకు ఇతర ముఖ్యనేతలతో పాటు, అఘోరనాథ్‌ను కూడా నిజాం హైదరాబాద్ నుంచి బహిష్కరించి కలకత్తాకు పంపించింది. కానీ అది ఎక్కువ కాలం నిలువలేదు. తొందరలోనే ఆయన సేవా దీక్షతను, మేధోశక్తిని గుర్తించిన నిజాం ప్రభుత్వం ఆయనను తిరిగి హైదరాబాద్‌కు ఆహ్వానించింది. తగిన స్థానం కల్పించి గౌరవించింది. ఆయన సేవలను ఉపయోగించుకున్నది
ఈ ఉద్యమ చైతన్యమే ఒక నిరంతర ప్రవాహంగా మారి తెలంగాణను ఈ రోజు ఉన్న స్థాయికి చేర్చింది. తెలంగాణ సమాజం మీద ఎంతో ప్రభావం కలిగించిన ఆర్యసమాజ్ 1892లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చాందా రైల్వే ఉద్యమంలో పాల్గొన్న కేశవరావు కోరాట్కర్ ఆర్య సమాజ్‌లో కీలక పాత్ర వహించి, 1905 వచ్చే సరికి హైదరాబాద్ స్టేట్ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆర్యసమాజ్‌లో పాల్గొన్న ప్రముఖులు చాలా మంది ఆ తర్వాత గ్రంథాలయోధ్యమంలో, ఆంధ్ర మహాసభలో ముఖ్యభూమిక పోషించారు.
ఈ ప్రవాహం నుంచే వెలువడిన మరొక పాయ దళితోద్యమం. మొదటిగా ఆర్య సమాజ్‌లో ఉన్న భాగ్యరెడ్డి వర్మ ఆ తర్వాత తానే సొంతంగా ఆది ఆంధ్ర ఉద్యమానికి రూపకల్పన చేశారు.
అఘోరనాథ్ స్థాపించిన యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ ఆర్య సమాజ్‌లోకి, ఆర్య సమాజ్ గ్రంథాలయోద్యమంలోకి, ఆ తర్వాత ఆంధ్ర మహాసభ. దాని కొనసాగింపే కమ్యూనిస్టు పార్టీ. అది నిర్వహించిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం. మరికొంత కాలం ప్రజలే నడిపిన పోరాటాలు. ఈ 1956 నుంచి 1969 వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ అవి ఎక్కడా నమోదు కాలేదు. ఆ చరిత్ర కెక్కని ఉద్యమాల చైతన్యం, భాగ్యరెడ్డి వర్మ సాగించిన దళిత ఉద్యమ ప్రస్థానం మళ్ళీ తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా సాగిన నక్సలైట్ ఉద్యమం. ఈ ఉద్యమాలతో పాటు అంటే 1920 దశకం నుంచి హైదరాబాద్ స్థానికుల ఉద్యోగ డిమాండ్ 1969 వచ్చే సరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా మారింది.
ఒకవైపు నక్సలైట్ ఉద్యమం, రెండో వైపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు సమాంతరంగా సాగాయి. అయితే 1990 దశకం చివరి నుంచి అనేక కారణాల వల్ల నక్సలైట్ ఉద్యమం కొంత సద్దుమణగడం, దేశంలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు, నక్సలైట్ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం డిమాండ్ వైపు దృష్టి మళ్ళించారు. దానితో తెలంగాణ ఉద్యయం ఒక ఉప్పెన లాగా మారింది. గతంలో ఉన్న అనుభవాల దృష్టా ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా ప్రజల భాగస్వామ్యంతో నడవడం, రాజకీయ పార్టీల నాయకుల భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీదనే ఆధారపడడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఈ రోజు తెలంగాణ ఒక శక్తివంతమైన రాష్ట్రంగా ఏర్పడడం వెనుక నూట యాభై ఏళ్ళ చరిత్ర దాగి ఉంది. అందుకే హైదరాబాద్ చైతన్యానికి బీజాల వేసిన గొప్ప ఉద్యమంగా చాందా రైల్వే ఉద్యమం చరిత్రలో నిలిచిపోవాలి. నిలుపుకోవాలి.

మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News