Wednesday, April 2, 2025

చందానగర్ నగల షాపులో చోరీ.. కన్నం వేసిన దొంగలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోడకు కన్నం వేసి నగల షాపులోని బంగారు ఆభరణాలు చోరీ చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చందానగర్, గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జూవెల్లరీ షాపులో చోరీ చేశారు. జూవెల్లరీ షాపుకు ఆనుకుని ఉన్న బట్టల దుకాణంలో నుంచి గోడకు కన్నం వేశారు దొంగలు. అందులో నుంచి జూవెల్లరీస్ షాపులోకి వెళ్లి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసిటివి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News