Wednesday, January 22, 2025

చంద్రబాబు నివాసంలో ముగిసిన చండీయాగం

- Advertisement -
- Advertisement -

హాజరై అధినేతకు పలువురి అభినందన

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం ఆదివారం ముగిశాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా పలు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు అందరికీ మేలు జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

గుంటూరుకు చెందిన వేద పండితులు పి.శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు అత్యంత వైభవంగా యాగం నిర్వహించారు. ఈ మూడు రోజులుగా నిర్వహించిన శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీయం, సుదర్శన హోమాల క్రతువులో టిడిపి మాజీ ఎంపి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన రావు దంపతులతో పాటు పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టిడిపి మీడియా కమిటీ ఛైర్మన్ ప్రకాశ్ రెడ్డి, అలాగే గుంటూరు, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలు కుటుంబ సభ్యులు ఈ యాగంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News