Thursday, December 19, 2024

చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు

- Advertisement -
- Advertisement -

Chandigarh Airport is named after Bhagat Singh

చండీగఢ్ : పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరును ఖరారు చేశాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ విషయం తెలిపారు. హర్యానా డిప్యూటీ సిఎం దుష్యంత్ చౌతాలాతో శనివారం సమావేశమైనట్టు చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పేరును చండీగఢ్ విమానాశ్రయానికి పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ అంశంపై శనివారం హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశమయ్యాం అని శనివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా 2016లో హర్యానా రాష్ట్ర అసెంబ్లీ దీనిపై ఏకగ్రీ వ తీర్మానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News