న్యూఢిల్లీ: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ అమృత్ మహోత్సవం ప్రత్యేక రోజు అని ప్రధాన అన్నారు. ఆ రోజున మనం భగత్ సింగ్ జీ జయంతిని జరుపుకుంటామన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 93వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు.
“భగత్‌సింగ్ జయంతికి ముందు ఆయనకు శ్రద్ధాంజలిగా ఓ ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నాము. చంఢీగడ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరును పెట్టబోతున్నాము” అని ప్రధాని మోడీ అన్నారు.
PM Modi, on radio show 'Mann Ki Baat' says, "People from many corners of the country expressed happiness over the return of Cheetahs; 1.3 cr Indians elated, filled with pride. A task force will monitor Cheetahs, on the basis of which we'll decide when you can visit the Cheetahs." pic.twitter.com/WmNOBxt5Er
— ANI (@ANI) September 25, 2022