Sunday, December 22, 2024

గుజరాత్ లో చాందిపుర వైరస్ హల్ చల్

- Advertisement -
- Advertisement -

నలుగురు చిన్నారుల మృతి

అహ్మదాబాద్: గుజరాత్ లో తాజాతా ఓ కొత్త వైరస్ ‘చాందిపుర వైరస్’ హల్ చల్ చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి నలుగురు చిన్నారులు చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిమ్మత్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ ను పుణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు సబర్ కాంత జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు.

చాందిపుర వైరస్ సోకిన వారిలో జ్వరం లక్షణాలు  కనిపిస్తాయి. ఫ్లూ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇది తీవ్ర స్థాయికి చేరితే మెదడు వాపు వస్తుంది. దాంతో చిన్నారులు చనిపోతారు. ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి కీటకాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News