- Advertisement -
అమరావతి: ప్రవీణ్ డెత్ మిస్టరీ చేదనలో సిసి కెమెరాలు కీలక పాత్ర. అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని వైసిపి చూస్తోందని అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తాము, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే… బాబాయ్ గొడ్డలి, కోడి కత్తి,.. గులకరాయి తరహాలో అన్నీ మనపైనే వేస్తారని సూచించారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే…లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారని వైసిపిపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతుంటే…వాటిని వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని తెలియజేశారు. అన్నింటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొడదామని చంద్రబాబు స్పష్టం చేశారు.
- Advertisement -