Sunday, February 23, 2025

జగన్‌తో కలిసి మేధావులు సైకోలుగా మారారు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సిఎం జగన్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైసిపి నేతలు విచిత్రమైన జంతువులు అని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాకినాడలో చంద్రబాబు పర్యటన సందర్భంగా మాట్లాడారు. కాకినాడ జిల్లాలో టిడిపికి వస్తున్న ఆదరణను చూసి వైసిపి తట్టుకోలేకపోతుందని, అనపర్తి పర్యటనకు అనుమతి లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన పర్యటన ఆపే ప్రసక్తే లేదని బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉంటే మేధావులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సైకోతో కలిసి మేధావులు కూడా సైకోలుగా మారారని దుయ్యబట్టారు. వైసిపి నేతలు సమాజానికి ప్రమాదం అని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News