అమరావతి: తాను ఏ తప్పూ చేయలేదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎపి పోలీసులు చంద్ర బాబును నంద్యాలలో అరెస్టు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగానని, తాను తప్పు చేస్తే? ఆధారాలేవని పోలీసులు అడిగానని, కానీ వారి నుంచి సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాలిక ప్రకారం అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై లేదా? అని చంద్రబాబు విమర్శించారు. ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు. నంద్యాలలో అరెస్టు చేసిన బాబును గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించనున్నారు.
ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలి: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -