అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హింస, శాంతిభద్రతలపై ఇసి తక్షణమే దృష్టి పెట్టాలని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎస్‌పిలు పరమేశ్వర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రవిశంకర్ రెడి వైసిపికి అనుకూలమన్నారు. మంగళవారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ముగ్గురు ఎస్‌పిల అండతోనే వైఎస్‌ఆర్‌సిపి గూండాలు చెలరేగుతున్నారని దుయ్యబట్టారు. కూర్చీ దిగిపోయే ముందు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు హింసా రాజకీయాలు చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. గిద్దలూరులో మునయ్య, నంద్యాలలో ఇమామ్ హత్యలను ఖండిస్తున్నామని, ఓటమి భయంతోనే టిడిపి కార్యకర్తలపై వైసిపి దాడులు చేస్తోందని, ప్రజాగళం సభకు జనాన్ని తరలిస్తే మునయ్యను వైసిపి వాళ్లు నరికి చంపారని, మాచర్లలో టిడిపి కార్యకర్త సురేష్ కారు తగలబెట్టారని, మూడు ఘటనల బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాజకీయ హింస, శాంతిభద్రతలపై ఇసి సమీక్షించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అందుకే మునయ్యను వైసిపి కార్యకర్తలు నరికి చంపారు: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -