Monday, January 20, 2025

అంతిమంగా గెలిచేది… నిలిచేది అమరావతే: బాబు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు 1200 రోజుల నుంచి ధర్నా చేస్తుండడంతో ధర్మం రైతుల వైపు ఉందని ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన, వేధింపులకు గురి చేసినా సంకెళ్లను ఎదురించి ముందుకు సాగుతున్న రైతులకు బాబు అభినందనలు తెలిపారు. రైతు ఉద్యమంలో న్యాయం ఉందని స్పష్టం చేశారు. అంతిమంగా గెలిచేది నిలిచేది అమరావతేనని ఆయన స్పష్టం చేశారు. ఎపికి అమరావతి రాజధాని ఉండాలని 1200 రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని రైతులు ఆరోపణలు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News