Thursday, January 23, 2025

ఓటరు జాబితాలో అవకతవకలపై సిఇసికి చంద్రబాబు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓటరు జాబితాలో అవకతవకలపై సిఇసికి ఫిర్యాదు చేశామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎపిలో జరుగుతున్న అన్ని అరాచకాలను సిఇసికె చెప్పామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని చర్యలు తీసుకుంటామని సిఇసి చెప్పిందని, అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపాలని, స్పెషల్ సెల్ పెట్టాలని సిఇసి అధికారులను చంద్రబాబు కోరారు. ఇసిని కలిసిన తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఇసి దృష్టికి తీసుకెళ్లేలా పని చేస్తామన్నారు. ఎపిలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చిందని, ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఎన్నికల విధులకు అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకోవాలని సూచించారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. బిఎల్‌ఒలుగా 2600 మంది మహిళా పోలీసులను పెట్టారని, టిడిపి, జనసేనపై దాదాపుగా 6 నుంచి 7 వేల కేసులు అక్రమంగా పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఒక్క పుంగనూరు కేసులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని, ఎన్నికల్లో ఎవరినీ పని చేయకుండా చేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News