Monday, December 23, 2024

నన్ను చంపాలని ఎవరో ప్లాన్ వేశారు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన పైనే హత్యాయత్నం కేసు పెట్టారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అంగళ్ల ఘటనకు సంబంధించి వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. ఇదెక్కడి దుర్మార్గమని అర్థం కావడం లేదన్నారు. తనపై చాలాసార్లు దాడికి యత్నించారని దుయ్యబట్టారు. దాడికి కుట్ర పన్నితే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెడతారా? అని చంద్రబాబు ఆగ్రహ వ్యక్తం చేశారు. తనపై ఎన్‌ఎస్‌జి, మీడియా, ప్రజల సాక్షిగా దాడి జరిగిందన్నారు. దాడి ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనని చంపడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారని, విచారణలో తేలాలని ఆరోపణలు చేశారు. ఎపిలో అందరిపైనా కేసులు పెట్టారని, మీడియాకు, రాజకీయనాయకులకు రక్షణ కరువైందన్నారు. చిరంజీవి చిన్న మాట అంటే ఎదురుదాడి చేస్తున్నారని, అధికారమనే పిచ్చిరాయి చేతిలో పట్టుకొని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Also Read: మీరు భారత మాతను హత్య చేశారు: రాహుల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News