Sunday, January 19, 2025

ఎన్‌టిఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం: బాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ కలను నిజం చేయడమే తెలుగు ప్రజల కర్తవ్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. రామరాజ్య స్థాపనకు ఎన్‌టిఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలన్నారు. తెలుగు ప్రజలారా రండి… ఆనాటి రామన్న రాజ్యం తిరిగి సాధించుకుందామని, దేశంలో సంక్షేమ పాలనకు ఎన్‌టిఆర్ ఆధ్యుడు అని బాబు ప్రశంసించారు. ఒకే ఒక జీవితం రెండు తిరుగులేని చరిత్రలు ఉన్నాయని కొనియాడారు. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చారని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News