Sunday, January 19, 2025

చరిత్ర ఉన్నంత వరకు టిడిపి ఉంటుంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ తెలంగాణ గడ్డపైనే టిడిపిని ఏర్పాటు చేశారని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంటింటీకి తెలుగు దేశం కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబిఎన్ మాట్లాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టిడిపిని స్థాపించారని, 41 ఏళ్లుగా తెలుగు వాళ్ల కోసం పని చేస్తున్న పార్టీ తెలుగు దేశం పార్టీ అని పేర్కొన్నారు. పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ టిడిపి అని ప్రశంసించారు.

చరిత్ర ఉన్నంత వరకు టిడిపి ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలు టిడిపితోనే ప్రారంభమయ్యాయని, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదవారికి ఎన్‌టిఆర్ స్వాతంత్య్రం అందించారని కొనియాడారు. భూమి శిస్తు రద్దు చేసి రైతుకు లాభం కలిగించింది ఎన్‌టిఆర్ అని, మహిళలకు సాధికారిత కల్పించింది ఎన్‌టిఆర్ అని, దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులు కల్పించామన్నారు. సైబరాబాద్ నిర్మించిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ టిడిపిని గుండెల్లో పెట్టుకున్నారని చంద్రబాబు కొనియాడారు. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుగు దేశం పార్టీ ఎక్కడ ఉందో కనిపిస్తుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News