Monday, January 20, 2025

రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు రాజకీయ కక్షతోనే అని అర్ధమవుతోందని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. తప్పు చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని అరెస్టు చేయడమే అర్థం కావడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని, మాజీ సిఎంను ఆదరాబాదరాగా అరెస్టు చేయాల్సిన పని లేదని విమర్శించారు. జి20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్టుకు సమయం కుదిరిందా? అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజ్ వచ్చిందని, ఎపి వైసిపి నేతల్లో ఓ దురలవాటు ఉందని, తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News