Friday, December 20, 2024

జగన్ కొత్తగా ఒక్క ఎకరాకైనా నీరిచ్చారా?: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జమ్మలమడుగులో టిడిపి నేత భూపేశ్ ప్రజల కోసం పని చేస్తారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు సర్కిల్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్థానిక వైసిపి ఎంఎల్‌ఎ చికెన్ కొట్టులో కూడా వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిఎంకు ప్రజలను దోచుకోవాలనే కోరిక తప్ప మేలు చేయాలని లేదని ధ్వజమెత్తారు. సిఎం జగన్ కొత్తగా ఒక్క ఎకరాకైనా నీరిచ్చారా? అని బాబు ప్రశ్నించారు. టిడిపి హయాంలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, జగన్ కేవలం రూ. రెండు వేల కోట్లే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News