అమరావతి: పోలవరం నిర్వాసితులను సిఎం జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రాజెక్టుల స్థితిగతులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితా మార్చారని, ఎకరానికి రూ.19 లక్షల పరిహారం హామీ ఏమైందని ప్రశ్నించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో కొత్త కట్టడం లేదని అడిగారు. తప్పు చేసి ఎదురుదాడి చేస్తే భయపడి మౌనంగా ఉంటామా? అని హెచ్చరించారు. కొంతమంది సిగ్గులేకుండా విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఆగిపోయాయని, ముసురుమిల్లి రిజర్వాయర్ పనులు ఆగిపోయాయని, దుర్మార్గుల బారి నుంచి పోలవరాన్ని కాపాడుకోవాలని సూచించారు. దొంగ చరిత్ర తెలిసి కూడా మళ్లీ మీరు ఓటేస్తారా? అని ప్రజలను నిలదీశారు.
Also Read: వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ