- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఎపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూన్ 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు ప్రమాణ స్వీకార సమయం మారింది. అదే రోజున ఉదయం 9.27 గంటలకు చంద్రబాబు సిఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అనేక రాష్ట్రాల సిఎంలు కూడా హాజరుకానున్నారు. దాంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -