- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా పెద్ద కుమార్తె అమెరికాలో సైకాలజిస్తుగా పనిచేస్తున్నారు. ఆమె నిన్న హైదరబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
- Advertisement -