Sunday, April 13, 2025

మార్క్ శంకర్ కు గాయాలు… స్పందించిన చంద్రబాబు, కెటిఆర్, బండి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లు స్పందించారు. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న  స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ఆందోళన కలిగించిందని సిఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలైన మార్క్ శంకర్‌ త్వరగా కోలుకోవాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బాబు తెలిపారు.

సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడడంపై బిఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మార్క్‌ శంకర్‌కు గాయాలు కావడం బాధ కలిగించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని బండి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News