Sunday, January 19, 2025

ఎయిర్ పోర్టులో చంద్రబాబు, స్టాలిన్ ఆసక్తికర భేటీ

- Advertisement -
- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ల భేటీ అయ్యారు. నిన్న ఎన్డీఎ కూటమి నిర్వహించిన సమావేశానికి చంద్రబాబు, ఇండియా కూటమి నిర్వహించి సమావేశానికి హాజరయ్యేందుకు బాబు, స్టాలిన్ లు ఢిల్లీకి వెళ్లారు. ఈ సమావేశాల అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు భేటీ అయ్యారు. రాష్ట్ర సంబంధిత సమస్యలపై చర్చలు జరిపారని తెలుస్తోంది. వీరిద్దరు భేటీ అయిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో చంద్రబాబుతో జరిగిన భేటీపై స్టాలిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చిరకాల మిత్రుడైన చంద్రబాబును ఢిల్లీ విమానాశ్రయంలో కలిశాను. ఎన్నికలో విజయం సాధించిన ఆయనకు నా శుభాకాంక్షలను తెలియజేశాను. సోదర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాను. ఆయన దక్షిణాది రాష్ట్రాల తరుపున వాదిస్తూ.. మన హక్కులను కాపాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తాడని నేను విశ్వసిస్తున్నాను” అని స్టాలిన్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News