- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భోగీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు తెల్లవారుజామునుంచే భోగీ వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.గుంటూరు జిల్లాలోని మందడం గ్రామంలో నిర్వహించిన భోగి సంబరాల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
పవన్, చంద్రబాబుతోపాటు టిడిపి, జనసేన నేేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు, పవన్ లు కలిసి భోగి మంటలు అంటించారు. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు.. జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇరు పార్టీల మహిళా నేతలు పాల్గొని ముగ్గులు వేశారు.
- Advertisement -