Sunday, January 19, 2025

మే 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ!

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో ఈ నెల 31న టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై ఇరువురు నేతలు సమీక్షించనున్నట్లు సమాచారం.

బుధవారం విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు దంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు అమరావతికి చంద్రబాబు వెళ్లనున్నారు. మరోవైపు ఎపిలో ఎవరు గెలుస్తారని కోట్లలో బెట్టింగ్ పెడుతున్నారు.వైసిపి, కూటమి నేతలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News