Monday, December 23, 2024

అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ సమావేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశం కానున్నారు. అమిత్ షా ఉదయం 11 గంటలకు పాట్నా వెళ్లనున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల ఖరారుపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతుంది. 10 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ప్రతిపాదనలు చేస్తోంది. కనీసం 8 లోక్‌సభ సీట్ల కోసం పట్టు పట్టినట్లు తెలుస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ వ్యూహాలు రచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News