Sunday, December 22, 2024

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లింలంతా నేడు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. ప్రవక్త ఇబ్రాహీమ్ తన ప్రియతమ కుమారుడిని దైవానికి బలి అర్పించిన విషయానికి స్మారకంగా ప్రతి ఏడాది ఈ పండుగను ముస్లింలు జరుపుకుంటున్నారు. బక్రీద్  పండుగను ఈద్ ఉల్-అధా అని కూడా అంటారు.

ముస్లింలు ప్రవక్త ఇబ్రాహీమ్ విశ్వాసానికి గుర్తుగా జంతువులను బలి ఇస్తున్నారు. అల్లాహ్ ఇబ్రాహీమ్ ను తన పట్ల ఎంత భక్తి ఉన్నది చాటమని ఆదేశించారు. ఇబ్రాహీమ్ తనకు అత్యంత ప్రియమైన కొడుకునే బలి ఇవ్వడానికి పూనుకోగా దైవం జిబ్రీల్(గాబ్రియెల్) అనే దేవదూతను పంపి ఇబ్రాహీమ్ కొడుకుకు బదులుగా మేకపోతు ను బలి ఇచ్చేలా చూశారు. ముస్లింలు నేటికీ ప్రవక్త ఇబ్రాహీమ్ త్యాగానికి గుర్తుగా జంతువులను దైవానికి బలి ఇస్తున్నారు.

ముస్లింల దైవగ్రంథం ఖురాన్ లో ప్రవక్త ఇబ్రాహీమ్ తన కుమారుడిని బలి ఇవ్వబూనడాన్ని , దానికి గుర్తుగా ఈద్ అల్-అధా(బక్రీద్)ను జరుపుకోవడం గురించి ఉంది. బక్రీద్ పండుగ ఆనందకరం లేక విషాధకరానికి ప్రతీకగా జరుపుకోవడం లేదు…కానీ ఇబ్రాహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకుంటున్నారు.

Chandrababu wishes for Bakrid

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News