Monday, December 23, 2024

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని, ఇలాంటి చర్యలను వైసిపి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని, శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులే కదా? అని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతల విషయంలో వైసిపికి సంబంధమేంటి? అని ప్రశ్నించారు. అరాచకాలు జరుగుతున్నది వైసిపి వల్లే కదా? అని అడిగారు. ఒక నాయకుడు అరెస్టైతే మద్దతుగా కచ్చితంగా అభిమానులు బయటకు వస్తారని, నాయకుడికి మద్దతుగా రావడం ప్రజాస్వామ్యంలో భాగమే కాదా? అని పవన్ కల్యాణ్ అడిగారు. ఇళ్లలో నుంచి బయటకెవరూ రాకూడదంటూ ఎలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగానే భావిస్తున్నామన్నారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని జనసేనాని స్పష్టం చేశారు.

Also Read: పెంపుడు మేకకూ రైలు టిక్కెట్..ఆ గామీణ మహిళ నిజాయితీకి వందనం(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News