Wednesday, January 22, 2025

ఎక్కడ జగన్ ఉంటే.. అక్కడ శనే: చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

బద్వేలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవికి ఎక్స్ పైరీ డేట్ వచ్చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వై.ఎస్.ఆర్. జిల్లాలోని బద్వేలులో జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి అంటే విశాఖ వాసులు భయపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎక్కడ జగన్ ఉంటే… అక్కడ శనే.. జగన్ ఓ ఐరన్ లెగ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీడీపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌కు కోల్పోయిన వైభవాన్ని తమ ప్రభుత్వం తిరిగి తెస్తుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News