Sunday, January 19, 2025

కృష్ణం రాజు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

Chandrababu condoles death of Krishnam Raju

హైదరాబాద్: ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు మృతి పట్ల తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ”ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News