Tuesday, January 21, 2025

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. సాయంత్రం విడుదలయ్యే ఛాన్స్

- Advertisement -
- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబుకు ఎపి రాష్ట్ర హైకోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఎట్టకేలకు బయటకు రానున్నారు. చంద్రబాబు ఆనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం వేసిన మధ్యంతర బెయిల్ మంజూరు పిటిషన్ పై మంగళవారం విచారించిన కోర్టు కండీషన్ బెయిల్ ఇచ్చింది.

రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 24 వరకు నాలుగు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఈ సమయంలో ఎలాంటి కాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని షరత్తు విధించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదని తెలిపింది. నవంబర్ 10న రెగ్యూలర్ బెయిల్ పై కోర్టు విచారించనుంది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News