Sunday, December 22, 2024

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎపి హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఇటీవల స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం బాబు బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సిఐడి తరఫున ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జస్టస్ టి. మల్లికార్జున్ రావు.. చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇస్తూ తీర్పు వెల్లడించారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనకు ఆధారల్లేవని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. చంద్రబాబు న్యాయవాది వాదనలను ఆంగీక్రిస్తున్నామని.. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని కోర్టు తెలిపింది. చంద్రబాబు, పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఆధారాలు లేవని.. ఈ నెల 28న బాబు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. మధ్యంతర బెయిల్‌పై ఉన్న షరతులు ఈ నెల 28వ తేదీ వరకే వర్తిస్తాయని చెప్పింది. ఈ నెల 29నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని.. చికిత్సకు సంబంధించిన నివేదికను ఎసిబి కోర్టులో అందించాలని కోర్టు ఆదేశించింది.

కాగా, మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ప్రస్తుతం వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారు. రెగ్యలర్ బెయిల్ రావడంతో.. నున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News