Sunday, December 22, 2024

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఛాయచిత్ర ప్రదర్శనను వీక్షించారు. 22, 23 గేట్ల వద్ద ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. పోలవరం పనుల గురించి బాబుకు అధికారులు వివరించారు. ప్రాజెక్టు ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్ ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల, పార్థసారిథి, పలువురు ఎంఎల్‌ఎలు ఉన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు అధికారులతో చంద్రబాబు సమీక్షలు జరుపుతారు. మధ్యాహ్నం 3.10 గంటలకు పోలవరం గెస్ట్‌హౌస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News