Monday, December 23, 2024

రామాలయ ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగే అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు వేల మంది అతిథుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

తాజాగా చంద్రబాబుకు కూడా ఆహ్వానపత్రిక అందింది. అటు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఇందుకోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి సీతారాములకు బహుమతులు అందుతుండగా ..ఆలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్టకు ఇప్పటికే శుభ ముహూర్తం నిర్ణయించారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపారవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News