అమరావతి : ఆంధ్రప్రదేశ్ రామతీర్ధంలో విజయసాయి రెడ్డి వాహనం మీద దాడి కేసులో ఎ1గా ఎపి మాజీ సిఎం చంద్రబాబు, ఎ2అచ్చన్నాయుడు, ఎ3గా కళా వెంకట్రావులను పేర్కొంటూ నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మరో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు వారిలో ఏడుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రామతీర్ధంలో ఎంపి విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టులో టిడిపి నేతలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుతో పాటు 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డిపై రాళ్ల దాడికి చంద్రబాబే ప్రధాన కారణమని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పార్టీ జెండాలతో రామతీర్ధం కొండపైకి వెళ్లిన విజయసాయిరెడ్డిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ దిగి బయటకు వస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు వద్దకు నడుస్తుండగా కొంత మంది ఆందోళనకారులు చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. రాయి తగిలి వాహనం ముందువైపు అద్దం స్వల్పంగా దెబ్బతింది. మరో వైపు జిల్లాలో శాంతి బద్రతలసమస్య తలెత్త కుండా సర్వమత పెద్దలతో కలిపి ప్రత్యేక కమిటిలను ఏర్పాటు చేసారు. ప్రస్తు తం రామతీర్థం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 ని అమలు చేయడంతో పాటు బోడికోండ పైకి ఎవరినీ అనుమతించడం లేదు.