Monday, December 23, 2024

సిఐడి కస్టడీకి బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈనెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎసిబి కోర్టు వెల్ల డించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చంద్రబాబును తన అభిప్రాయాన్ని కోరారు. దీంతో చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జైలులో తనను ఏంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని న్యాయమూర్తితో చంద్రబాబు అన్నారు. తన హక్కులు కాపాడాలని, న్యాయాన్ని రక్షిం చాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబును పోలీసులు ఎసిబి కోర్టులో వర్చువల్‌గా హాజరు పరిచారు. రిమాండ్ సమయం నేటితో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొచ్చారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తన దని, నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని చెప్పారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని, అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని, తన మీద ఉన్నవన్నీ ఆరోప ణలు మాత్రమేనని, నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ఇదే నా బాధ, ఆవేదన, ఆక్రందన అని అన్నారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జిని కోరారు.

రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతి
ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే చంద్రబాబును ఎక్కడ విచారిస్తారని ఎసిబి న్యాయమూర్తి సిఐడిని ప్రశ్నించింది. జైల్లో విచారిస్తారా? తటస్థ ప్రదేశంలో విచారిస్తారా? అని జడ్జి ప్రశ్నించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు కూడ అనుమతి ఇచ్చింది.ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయం త్రం ఐదు గంటలలోపుగానే చంద్రబాబును ప్రశ్నించాలని ఆదేశించింది. మరో వైపు విచారణ సమయంలో తీసిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని ఆదేశిం చింది. విచారణ జరిపే అధికారుల పేర్లను కూడ ఇవ్వాలని న్యాయమూర్తి సిఐడిని కోరారు. మరో వైపు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తామని ఎసిబి కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. అయితే కస్టడీ పిటిషన్‌పై విచారణ సమయంలో బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినపడం సరైంది కాదని ఎసిబి కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.ఈ పిటిషన్‌పై శనివారం వాదనలను వినిపిస్తామని చంద్రబాబు న్యాయవాదులు చెప్పారు. అయితే శనివారం వాదనలను వినడానికి ఎసిబి కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో సోమ వారం ఎసిబి కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగే అవకాశం ఉంది.

క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రధానంగా క్వాష్ పిటిషన్‌లో రెండు అభ్యర్థనలు చేశారు. ఒకటి కింది కోర్టు ఇచ్చిన అరెస్టు, రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని, అదే విధంగా సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. 17ఎ సెక్షన్ పాటించలేదని, తనపై పెట్టిన 409 సెక్షన్ చెల్లదని చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా బలంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో సిఐడి సరైన దర్యాప్తు చేయలేదని, ఆధారాలు లేవని కోర్టుకు పేర్కొన్నారు. మరోవైపు సిఐడి తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకల్ రోహత్తీ వాదనలు వినిపించారు. ఈ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసులో ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను తోసి పుచ్చుతూ తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 140 మంది సాక్షులను విచారించారని, 4 వేల కాపీలను అందజేశారని వెల్లడించారు. ఈ సమయంలో పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ దశలో క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. ఈ సందర్భంగా నీహారిక వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను న్యాయమూర్తి ఉదహరించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆశ్రయించనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఎపి హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో లోకేష్, టిడిపి ముఖ్య నేతలు లాయర్లతో సమావేశమై చర్చించారు. ఈ విషయమై సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్లు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసులలో పీటీ వారంట్ లు కూడ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబుపై దాఖలైన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
సిద్ధార్థ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్…!
‘ ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది, కొత్త రోజు వెలుగునిస్తుంది, రాత్రి తర్వాత మీ తెల్లవారుజాము ఉదయం మన జీవితాల్లో వెలుగు నిస్తుంద’ని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా ట్వీట్ చేశారు. చంద్రబాబు తరపునన ఎసిబి కోర్టుతో పాటు హైకోర్టులోనూ వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్‌పై విచారణకు హరీష్ సాల్వే కూడా వచ్చారు. అయితే చంద్రబాబుకు ఊరట లభించకపోవడంతో సిద్ధార్థ లూథ్రా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అందుకే తదుపరి ప్రయత్నాల్లో న్యాయం లభిస్తుందని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.

సిఐడి కస్టడీకి చంద్రబాబు
నేడు రాజమండ్రికి వెళ్లనున్న సిఐడి బృందం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును విచారించేందుకు శనివారం సిఐడి బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది. ఎసిబి కోర్టు సూచించిన నిబంధనల మేరకు సిఐడి అధికారులు విచారణ జరపనున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఆయన ఖండిం చారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ జరిగిందని, రాజకీయాల్లో ఇలాంటి తీరు సరికాద న్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని సూచించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని గుర్తించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News