Monday, December 23, 2024

ఖమ్మంలో పర్యటించనున్న చంద్రబాబు…

- Advertisement -
- Advertisement -

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గం.లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి బయలు దేరనున్న చంద్రబాబు 9.30 గం.లకు రసూల్‌పుర ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 9.45 గంటలకు ఈశ్వరీబాయి విగ్రహం కూడలి నుంచి హబ్సిగూడ, ఉప్పల్ చౌరస్తా, ఎల్‌బినగర్, హయత్‌నగర్ బస్ డిపో, పెద్ద అంబర్‌పేట, రామోజీఫిలిం సిటి, కొత్తగూడ, చౌటుప్పల్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు నాయకం గూడెం మీదుగా కూసుమంచి చేరుకుంటారు.

రెండున్నరకు కేశవాపురం వద్ద ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మ.3 గంటలకు ఖమ్మం చేరుకుని మ.3.15 గం.లకు మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు స్టేడియం నుండి బయలుదేరి వెంకటయ్యపాలెం మీదుగా చింతకానికి రాత్రి 8 గం.లకు చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు పాతర్లపాడు వద్ద ఎన్‌టిఆర్ విగ్రహం ఆవిష్కరిస్తారు. రాత్రి 9.15 గంటలకు పాతర్లపాడు నుంచి బయలుదేరి నాగలవంచ క్రాస్ రోడ్డు, నోనకల్, చిల్లకల్, విజయవాడ హైవే మీదుగా ఉండవల్లి నివాసానికి చేరకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News