- Advertisement -
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా టిడిపి కార్యాలయంలో ‘జన నాయకుడు’ అనే పోర్టల్ ను సిఎం ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సిఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై ఫిర్యాదులను ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదు తీసుకున్న వెంటనే అక్కడిక్కక్కడే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని, అధికారులకు ఆదేశాలిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
- Advertisement -