Monday, December 23, 2024

వైసీపీ పాలనపై ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. జగన్ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. దాడుల గురించి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విపక్ష నేతలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహిళలపై అకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారిందని తెలిపారు. ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లుగా పరిస్థితి మారిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే తాను పర్యటనలు చేపట్టానని, అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News