Wednesday, January 22, 2025

హైదరాబాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే నమ్మకం ఆశతో ఆ భూములు విలువ పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్‌లో 4 ఎకరాలు కొనే వారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణం ఎవరని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు వైసిపి నేతలపై ఫైర్ అయ్యారు. ”వైసీపీ నేతలూ! మీ పాలనకు ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీకు తగిన చోటు చూపిస్తాం. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది”. అని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News