Thursday, December 19, 2024

తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..

- Advertisement -
- Advertisement -

Chandrababu meets with Telangana TDP Leaders

తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి-సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలి
-తెలంగాణ టిడిపి నేతలతో భేటిలో చంద్రబాబు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల్లో టిడిపిపై అభిమానం నివురుగప్పిన నిప్పులా ఉంటుందన్నారు. అది ఎప్పుడైనా రాజుకుంటుందన్నారు, దానిని ఆర్పటంగాని, ఆపటంగాని ఎవరివల్లా కాదన్నారు.
ప్రజల్లో ప్రగాఢ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడమే నాయకత్వ పటిమ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పనిచేసేవాళ్లకే ప్రజల్లో గౌరవం ఉంటుందన్నారు. ప్రజల్లో గౌరవం ఉంటేనే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. పని చేయకుండా గౌరవం, గుర్తింపు దొరకవనేది గుర్తుంచుకోవాలని నేతలకు సూచించారు. తెలంగాణ, ఎపి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ టిడిపి రూపొందించినవేనని అన్నాఉ. పవర్ ప్లాంట్లన్నీ టిడిపి నెలకొల్పినవేనని పేర్కొన్నారు. ఇక ఐటి, ఫార్మా కంపెనీలన్నీ టిడిపి తెచ్చినవేనని, సామాజిక సంపద అంతా టిడిపి వల్ల పెరిగిందన్నారు. స్థానికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, దేశాభివృద్ధికి దోహదపడ్డామన్నారు.
టిడిపికి ముందు, టిడిపి తర్వాతగా రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రను చూడాలన్నారు. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విజన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అభివృద్ధి పథంలో నిలిపిందన్నారు. వాజ్ పేయి హయాంలో చేపట్టిన టెలికం రెగ్యులేటరీ పాలసీనే నేడు 5జీ కి బాటలు వేసిందన్నారు. అప్పటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారులు, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మా రంగాల అభివృద్ధి కొత్తపుంతలు తొక్కిందన్నారు. మాజీ ఎంఎల్‌సి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ టిడిపిలో చేరడం శుభపరిమాణమని అన్నారు.. పార్టీలో చేరికలను మరింతగా ప్రోత్సహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఉన్న నాయకత్వం పదును తేలాలి, కొత్త నాయకత్వం రూపొందాలన్నారు. అలాగే పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా, ఏ పని చూసినా టిడిపి చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. హైదరాబాద్‌లో అడుగడుగునా టిడిపి అభివృద్ధి ముద్రే కనిపిస్తుందజన్నారు. దీనిపై గతంలో అవహేళన చేసినవాళ్లే ప్రస్తుతం అభివృద్ధి ఫలాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. టిడిపి చేసిన అభివృద్ధిపై ఇంటింటికి ప్రచారం చేయాలి.
తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తేవడమే శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళిగా చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్రపార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కంభంపాటి రామమోహన రావు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, సామా భూపాల్ రెడ్డి, బంటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Chandrababu meets with Telangana TDP Leaders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News