Monday, January 20, 2025

చంద్రబాబుది 420 బర్త్ డే: మంత్రి కారుమూరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసుకున్నది 420 బర్త్ డే అని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ధ్వజమెత్తారు. బాబే ఇంద్రుడు, చంద్రుడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 600 వాగ్ధానాలను చేసి ప్రజలను మోసం చేసి ఘనుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోస్తే బాబు అడ్డుకున్నారని గుర్తు చేశారు. మరో కపట నాటకానికి నయవంచకుడు రెడీగా ఉన్నాడని ప్రజలు మోసపోవద్దని కారుమూరి సూచించారు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అని, తోడబుట్టినవాడిని గదిలో బంధించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. హత్య రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని కారుమూరి చురకలంటించారు. వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ ఎలా చనిపోయారో అందరికీ తెలుసునని, త్వరలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News