Sunday, January 19, 2025

అక్కడ చంద్రబాబు, బాలకృష్ణను ఓడిస్తాం: పెద్దిరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందన్నారు. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అవగాహన లేక ఇసికి ఫిర్యాదు చేశారని, నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే అని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్దిరెడ్డి వివరించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్నారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని చెప్పారు. ఇద్దరు వెనుకబడిన వర్గాలకే చెందిన మహిళలకు చోటు కల్పించామన్నారు. టికెట్ల కేటాయింపులో కొంత అసంతృప్తి ఉంటుందని, కానీ త్వరలోనే అధిగమిస్తామన్నారు. టిడిపి-జనసేన నుంచి ఎవరో పోటీ చేస్తారో ఇప్పటివరకు స్పష్టతలేదన్నారు. 99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశామని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News