- Advertisement -
అమరావతి: జైలులో ఉంచి తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు పొడిగించిన సందర్భంగా కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాలను జడ్జి కోరారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జికి వివరించానని, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదని, తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు ఎలా చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందిగా కోరారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాలేదా? అని జడ్జిని అడిగారు. అన్యాయంగా తనని అరెస్టు చేశారని, ఇది తన బాధ, ఆవేదన, ఆక్రందన అని జడ్జికి చంద్రబాబు వివరించారు.
Also Read: ‘కేబుల్ రెడ్డి’గా సుహాస్
- Advertisement -