Sunday, January 19, 2025

జగన్ పై చంద్రబాబే దాడి చేయించారు: మంత్రి రోజా

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా నిరసన తెలిపారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాడులు చేయించారని, చంద్రబాబు నాయుడును తక్షణమే అరెస్టు చేయాలని, పవన్ కల్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడికి సమీపంలో ‘మేమంతా సిద్ధం’ సందర్భంగా సిఎం జగన్ యాత్ర చేస్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై రాయితో కొట్టడంతో గాయమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News