Wednesday, January 22, 2025

చంద్రబాబు కింగ్‌మేకర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఊహించిన దాని కన్నా మెరుగైన సీట్లు సాధించి అధికార ఎన్‌డిఎకి కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు దేశ ప్రజల చూపు ఆంధ్రప్రదేశ్‌పై పడింది. మరీ ముఖ్యంగా.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపితో పొత్తుపెట్టుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి మ్యాజిక్ ఫిగర్ మార్క్‌ను దాటగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి -జనసేన- బిజెపి కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి లోక్‌సభ ఎన్నికల్లోనూ మెరుగైన ప్రదర్శించడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి.

అందులో టిడిపి 16 స్థానాలు గెలువగా, జనసేన 2, బిజెపి 3 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. వైఎస్‌ఆర్‌సిపి రెండు చోట్ల విజయం సాధించింది. లోక్‌సభలో మెజారిటీ మార్క్ 272. ఒకవేళ ప్రస్తుత ట్రెండ్ కొనసాగి.. ఎన్‌డిఎ కూటమి 285 సీట్లల్లోనే గెలిస్తే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి సంపాదించుకునే ఎంపి సీట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఎన్‌డిఎ కూటమి 292 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి 233 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఊహించని విధంగా అంచనాలను తారుమారు చేస్తూ.. కాంగ్రెస్ కూటమి కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో.. స్వాతంత్య్ర అభ్యర్థులు.. పలు ప్రాంతీయ పార్టీలతో మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.చంద్రబాబుతో కాంగ్రెస్ చర్చించే అవకాశమందని విశ్వనీయవర్గాలు చర్చించినట్లు ఊహగానాలు వెలువడతుండటం చర్చనీయాంశంగా మారింది. వారితో కెసి వేణుగోపాల్, మమతా బెనర్జీ చర్చించనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.. అయితే.. దీనిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.. ఇవన్నీ ఊహగానాలు మాత్రమేనని.. అలాంటివి ఏం లేనట్లు ఆయా పార్టీల వర్గాలు కొట్టిపడేస్తున్నాయి.

కేంద్రంలో ఎపిదే కీలక పాత్ర
ఎన్నికల రణక్షేత్రంలో అన్నిసార్లు పార్టీల వ్యూహాలు ఫలించవు. ఈసారి తిరుగులేని విజయం సాధిస్తామని, 400 పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎన్‌డిఎ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షం పట్టుదలగా పోరాడి ఎన్‌డిఎ మెజార్టీని బాగా తగ్గించింది. కానీ బిజెపి కూటమిని అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది. గత ఎన్నికల్లో 353 సీట్లు సాధించిన ఎన్‌డిఎ ఈసారి 300మార్కును దాటడానికి కష్టపడింది. ఎప్పటిలాగే బిజెపి కంచుకోట రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఆదుకున్నా, ఈ సారి అనూహ్యంగా దక్షిణాదిలో ఎన్‌డిఎ కూటమికి బలం చేకూరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో చెప్పుకోదగ్గ సీట్లు సాధించగా, చరిత్రలో తొలిసారి కమ్యూనిస్టు కంచుకోటలోనూ ఖాతా తెరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అందులో టిడిపి 16 స్థానాలు గెలువగా, జనసేన 2, బిజెపి 3 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. వైఎస్‌ఆర్‌సిపి రెండు చోట్ల విజయం సాధించింది. అధికార ఎన్‌డిఎ పార్టీకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వడంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎపి కీలకపాత్ర పోషించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News