Thursday, December 19, 2024

ఇక నుంచి నాలో మారిన మనిషిని చూస్తారు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని, కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం అమరావతిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రమూ ఉండదన్నారు. రాజకీయ పరిపాలన సాగుతుందని వెల్లడించారు. ఎంపీలు అందరూ తరుచూ తనను వచ్చి కలవాలని సూచించారు. బిజీగా ఉన్నప్పటికీ మీతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. తన కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని గుర్తు చేసుకున్నారు.

అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదన్నారు. ఇకపై ప్రతి అంశాన్ని వింటానని, తానే స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అందరూ ఎవరి పరిధిలో వారు పని చేయాలన్నారు. ఈ అయిదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు మనోవేదన కలిగించాయని భావోద్వేగానికి లోనయ్యారు. నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News