Monday, January 20, 2025

ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదిలా మహిళను అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మూల్పూరి కల్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే గాక అరెస్ట్ చేస్తారా? అని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఫిబ్రవరి 20న గన్నవరంలో టిడిపి, వైసిపి మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో రెండు కేసులు నమోదు కావడంతో నిందితురాలిగా ఉన్న టిడిపి మహిళా నేత మూల్పూరి కల్యాణిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదిలా అరెస్ట్ చేసే విధానం బాగోలేదని పోలీసులను హెచ్చరించారు. వైసిపి దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై ఇలానా ప్రవర్తించేదన్నారు. హత్యకేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటని బాబు ఎద్దేవా చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మూల్పూరి కల్యాణి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News